టాలీవుడ్ లో దర్శకుడి పూరీ జగన్నాథ్ స్టైలే వేరు. ఆయన సినిమా చేస్తున్నాడంటే సినిమా మొదలు కాకముందే దాని గురించి మాట్లాడుకునేలా చేస్తాడు. మొన్నటి వరకు సంవత్సరానికి మూడేసి సినిమాలు తీసేసి జనాల పైకి వదిలిన పూరీ అవి కాస్తంత బెడిసి కొట్టడంతో ఇప్పుడు కాస్తంత నెమ్మదించాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాకు సమాయత్తం అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టనేలేదు అప్పుడే ఈ సినిమా టీజర్ రెడీ అయిపోదంట. అదెలా అబ్బా ? సినిమా ప్రారంభం అయ్యి, కొన్ని రోజుల షూటింగ్ తరువాత అందులోని రషెస్ ని కట్ చేసి కదా టీజర్ గా వదిలేది ? అదే పూరీ స్పెషాలిటీ. అలా అని తెర వెనుక షూటింగ్ ఏం జరపలేదు. ఈ టీజర్ లో ఓ చిన్న డైలాగుతో పాటు, ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ ని పెట్టి, కొంత మంది టెక్నీషియన్స్ పేర్లతో తయారు చేశారట.
ఈ సినిమా షూటింగును ఈనెలాఖరులో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆరోజే ఎన్టీఆర్ అభిమానులను అలరించే టీజర్ ని విడుదల చేస్తారట. బండ్ల గణేష్ నిర్మాతగా, కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. చాలా సంవత్సరాల తరువాత మళ్లీ ఎన్టీఆర్ తో చేస్తున్న పూరీ ఎలాగైనా హిట్టివ్వాలనే పట్టుదలతో ఉన్నాడు.

No comments:
Post a Comment