h

m

Friday, 11 July 2014

రభస ఆడియోకు స్పీకర్లు లేవు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రభస’. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఏ సమయంలో ప్రారంభించారో కానీ... అప్పటి నుంచి ఈ సినిమాకు అన్నీ ఆటంకాలే. షూటింగ్ ప్రారంభించి దాదాపు ఆరునెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఇంకా సౌండులేదు ఏం లేదు. ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో ‘రభస’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కనీసం ఈ సినిమానైనా ఘన విజయం సాధించాలని అభిమానులు చాలా ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల విషయంపై అభిమానులు తొందరపెడుతుండటంతో ఇటీవలే ఎన్టీఆర్ పుట్టినరోజు సంధర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. అయితే ఈ చిత్ర ఆడియోను ఆగష్టు 14న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ ‘రభస’ సౌండ్ ఆగష్టులో వినిపించే ప్రసక్తే లేదని తాజా సమాచారం. 

భారీ బడ్జెట్ తో నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను ఆగష్టు 14న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అందుకు పోలీసుల పర్మిషన్ దొరకలేదు. ఈ ఆడియో వేడుకకు పోలీసులు చాలా కండిషన్లు పెడుతున్నారట. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ నటించిన ‘బాద్ షా’ చిత్ర ఆడియో వేడుకలో పోలీసులు ఎంత కట్టుదిట్టమైన రక్షణ కల్పించినా కూడా అక్కడ తొక్కిసలాట జరిగి ఓ ఎన్టీఆర్ అభిమాని మరణించాడు. అంతే కాకుండా ప్రస్తుతం రంజాన్ మాసం కూడా నడుస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రతా కారణాలరిత్యా పోలీసులు ఈ వేడుకను వాయిదా వేసుకోమని సూచనలిచ్చారట. దీంతో ఈ చిత్ర ఆడియోను రంజాన్ తరువాతే విడుదల చేయాలనే చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. మరి ఈ ఆడియో ఎప్పుడు విడుదలవుతుందో.. సినిమా ఎప్పుడూ వెండితెరమీదకొస్తుందో అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

No comments:

Post a Comment