ఐటెం రేటు 4నిమిషాలకు 50లక్షలు

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆగడు’. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో టాలీవుడ్ టాప్ హీరోయినైనా శృతిహాసన్ ఐటెం సాంగులో చిందులేయబోతుందన్న విషయం తెలిసిందే. అయితే కేవలం ఈ ఐటెం సాంగులో నటించడానికి శృతిహాసన్ 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుందట. కేవలం మూడురోజులలో మాత్రమే ఈ పాటను చిత్రీకరించనున్నారట. శృతిహాసన్ కూడా ఈ రెమ్యునరేషన్ ను మూడు రోజులు+ ఐటెం సాంగు... రెండింటికి కలిపే 50 లక్షలు వసూలు చేస్తుందని తెలిసింది. శృతిహాసన్ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఏం ఆలోచించట్లేదట. ఎందుకంటే ఈ సినిమాలో ఈ పాట ప్రధాన ఆకర్షణ అవుతుందని వాళ్లు నమ్మకంతో ఉన్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా గతంలో మహేష్, శ్రీనువైట్లల కాంబినేషన్ లో ‘దూకుడు’ అనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించారు. అందులో ‘పూవయ్ పూవయ్...’ సాంగు ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. అయితే మళ్లీ ‘దూకుడు’ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంలో కూడా అలాంటి ఓ హాట్ ఐటెం సాంగ్ ఉందట. ఆ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందని నిర్మాతలు కొండంత ఆశతో ఉన్నారు. మహేష్ సరసన మొదటిసారిగా హీరోయిన్ తమన్నా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. ట్రైలర్ చూసినవాళ్లందరూ కూడా ఇదేదో మైనింగ్ మాఫీయా బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కినట్లుగా అనిపిస్తుందని, అంతే కాకుండా గబ్బర్ సింగ్ చిత్రానికి ఆగడు చిత్రానికి దగ్గర పోలీకలు చాలా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆగడు సినిమా కథ ఇదేనంటూ టాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ కథలు కూడా మైనింగ్ మాఫీయా నేపథ్యంలో ఉన్నవే. దీంతో ఆగడు సినిమాపై రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. కానీ ఆగడు చిత్ర దర్శక, నిర్మాతలు యూనిట్ మొత్తం కూడా సినిమా ఘన విజయం సాధిస్తుందనే ధీమాతో ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో, శృతిహాసన్ ఎంతవరకు ఉపయోగపడిందో త్వరలోనే తెలియనుంది.
No comments:
Post a Comment