h

m

Friday, 11 July 2014

“బాహుబలి” కథ ఇదేనా?




జక్కన్న చెక్కుతున్న “బాహుబలి” రోజురోజుకు ప్రేక్షకులలో ఉత్కంఠని కలిగిస్తోంది. ప్రభాస్, అనుష్క , రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అంతలా ఈ సినిమా పట్ల హైప్ ని క్రియేట్ చేశాడు దర్శకుడు రాజమౌళి.
ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాహుబలి (ప్రభాస్) తల్లి రాజమాత పాత్రను రమ్యకృష్ణ పోషిస్తోందని సమాచారం. “బాహుబలి”లో మొదటి అరగంటలోనే రమ్యకృష్ణ పాత్ర పూర్తవుతుందట. శత్రువుల 
నుంచి శివుడి(ప్రభాస్) ని కాపాడే ప్రయత్నంలో రాజమాత ప్రాణాలు విడుస్తుందట. అప్పుడు శివుడిని గిరిజన ప్రజలు పెంచుతారట.
ఈ విధంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న “బాహుబలి” చిత్రం పట్ల వివిధ కథనాలు టాలీవుడ్ లో వస్తున్నాయి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదలవబోతున్నట్టు సమాచారం.

No comments:

Post a Comment