టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్లలో ఒక్కరు. దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది. ఒక్క పవన్ తో తప్ప. ఇప్పుడు ఆ కోరిక కూడా తీరబోతుంది. గత కొంత కాలంగా అవకాశాల్లో సమంతా కంటే వెనకబడి పోవడంతో ఈమె పని అయిపోందని అనుకున్నారు సినీ జనాలు. ఆచితూచి అడుగులు వేస్తూ తాపీగా కెరీర్ ని ప్లాన్ చేసుకోవడమే కాకుండా, కాస్తంత బ్రేక్ ఇచ్చిన తరువాత పెద్ద పెద్ద అవకాశాలతో అందరికి షాక్ ఇస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ గోవిందుడు వేశాల్ని , ఎన్టీఆర్ ‘టెంపర్ ’ ఏంటో చూడబోతున్న ఈ భామ ‘గబ్బర్ సింగ్ తిక్క ’ కూడా చూడబోతుంది. అవును ఈ అమ్మడుకు ఎప్పటి నుండో తీరకుండా మిగిలిపోయిన ఆ కోరిక తీరబోతుంది. గత కొంత కాలంగా హీరోయిన్ లేక వాయిదా పడుతున్న ఈ సినిమా హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నట్లు చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. ‘గబ్బర్ సింగ్ - 2 ’ చిత్రంలో పవన్ కి జోడిగా చాలా మంది బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లను చూసినా చివరకి ఈ అవకాశాన్ని కాజల్ సొంతం చేసుకుంది. గతంలో ఓసారి ఇదే సినిమాలో నటించమని కాజల్ ని అడిగితే ఏదో కారణాలు చెప్పి తప్పించుకుంది. చివరికి మళ్ళీ అదే అవకాశం రావడంతో మరో మాట చెప్పకుండా ఒప్పేసుకుంది. ప్రస్తుతం ‘గోపాల గోపాల ’ సినిమా షూటింగులో బిజీగా ఉన్న పవన్ వచ్చే నెల నుండి సంపత్ నంది దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్ -2 ’ లో బిజీ కానున్నారు
Monday, 7 July 2014
కాజల్ ఆ ఒక్క కోరిక కూడా తీరబోతుంది.

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment