“గీతాంజలి” చిత్రంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఐటం సాంగ్ చేస్తోందనే వార్తలు రెండు రోజులుగా మీడియాలో వస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఐటం సాంగ్ చేస్తున్నందుకు ఈమె భారీ మొత్తంలో పారితోషికాన్ని పుచ్చుకుంటుందనే కథనాలు కూడా వచ్చాయి. అయితే అవన్ని ఒట్టి పుకార్లు మాత్రమేనని మిత్రవింద కాజల్ తేల్చి చెప్పింది. తాను ఏ ఐటెం సాంగ్‌లో నటించడం లేదని ఖరాకండిగా తేల్చిపారేసింది.
అంజలి హీరోయిన్‌గా, బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మీతో కాజల్ ఐటెం సాంగ్ చేస్తుందనే వార్తలు రాగానే సినిమాపై అంచనాలు తారా స్థాయిలో వచ్చాయి. ఆ వార్తలను ఈమె ఖండించడంతో మళ్లీ ఈ చిత్రంలో ఐటెం సాంగ్ చేయబోయే హీరోయిన్ ఎవరా అనే చర్చ మొదలైంది. రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పిస్తున్నాడు. వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.

No comments:
Post a Comment