h

m

Sunday, 6 July 2014

దిల్ రాజు పై సమంతా షాకింగ్ సెటైర్స్

ఇప్పటిదాకా క్యూట్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలుతున్న సమంత ఒక మెట్టు ఎదిగింది. ఏకంగా ఒక సినిమా ఆడియో ఫంక్షన్ కు అతిధిగా రావడమే కాకుండా ఆ ఆడియో వేడుకలో అందరితో కలివిడిగా ఉంటూ ఏకంగా దిల్ రాజ్ త్రివిక్రమ్ లను టార్గెట్ చేస్తూ జోక్స్ వేయడమే కాకుండా ఆ ఆడియో ఫంక్షన్ కు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది. సుమంత్ అశ్విన్, నందిత జంటగా నటిస్తున్న చిత్రం ‘లవర్స్’ సినిమాను దర్శకుడు మారుతి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఆడియో వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ముఖ్య అతిథిగా హాజరైన ఆడియో ఆవిష్కరించింది.  స్టార్ దర్శకుడు వివి వినాయక్ లోగో ఆవిష్కరించగా మరో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు.
అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్న ఈవేడుకలో ఒక రాజకీయ నాయకుడిలా అందరితోనూ కలివిడిగా ఉంటూ సందడి చేసిన సమంత హడావిడి చూసిన వారు సమంతకు రాజకీయ లక్షణాలు వచ్చేసాయి అంటూ సెటైర్లు వేసారు.  దిల్ రాజు, వివి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వారిని తెగ నవ్విస్తూ అదరగొట్టిన సమంత షో ని చూసిన వారు ఇది ‘లవర్స్’ ఆడియో వేడుకలా కాకుండా సమంత షో గా మారిపోయింది అంటూ కామెంట్స్ చేసుకోవడం వినిపించింది.

No comments:

Post a Comment